kejriwal: ప్రధాని మోదీ వ్యక్తిగత అవినీతి సమాచారాన్ని బయటపెట్టండి, రాహుల్ జీ!: కేజ్రీవాల్‌


వీలుదొరికినప్పుడల్లా బీజేపీ, కాంగ్రెస్‌ల‌పై విమ‌ర్శ‌లు గుప్పించే ఢిల్లీ ముఖ్య‌మంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ మరోసారి త‌మ‌ ప్ర‌త్య‌ర్థి పార్టీల‌పై విమ‌ర్శ‌లు సంధించారు. ఇటీవ‌ల కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ త‌నను లోక్‌స‌భ‌లో మాట్లాడ‌నివ్వ‌డం లేద‌ని, త‌న‌ వ‌ద్ద ప్రధాని మోదీ వ్యక్తిగత అవినీతికి సంబంధించిన‌ సమాచారం ఉంద‌ని వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. రాహుల్ చేసిన వ్యాఖ్య‌లే త‌న అస్త్రాలుగా కేజ్రీవాల్ ట్విట్ట‌ర్‌లో ఓ ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ వ్యక్తిగత అవినీతి సమాచారం ఎప్పుడు బయటపెడుతున్నారని రాహుల్‌ని ప్ర‌శ్నించారు. రాహుల్ ద‌గ్గ‌ర అందుకు సంబంధించిన రుజువులు ఉంటే వాటిని పార్లమెంటులోనే ఎందుకు బ‌య‌ట‌పెట్టాల‌ని అనుకుంటున్నార‌ని, పార్ల‌మెంటు బయట కూడా బహిర్గతం చేయొచ్చు క‌దా అని కేజ్రీవాల్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News