axis bank: యాక్సిస్‌ బ్యాంక్ శాఖలో నకిలీ ఖాతాలు: మనీలాండరింగ్‌ నేరం కింద ఈడీ కేసు న‌మోదు


పెద్ద‌నోట్ల ర‌ద్దు నేప‌థ్యంలో ఇటీవ‌లే ఢిల్లీలో ముమ్మ‌రంగా త‌నిఖీలు చేప‌ట్టిన అధికారులు నోయిడా సెక్టార్‌ 51లోని యాక్సిస్‌ బ్యాంకు శాఖలో పెద్ద ఎత్తున అక్ర‌మ లావాదేవీలు జ‌రిగాయని గుర్తించిన సంగ‌తి తెలిసిందే. ఆ బ్యాంకులో కొన‌సాగుతున్న‌ నకిలీ ఖాతాల వ్యవహారంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కేసు నమోదు చేసింది. ఆ బ్యాంకు శాఖ‌లో 20 న‌కీలీ సంస్థ‌ల‌ పేర్లతో దాదాపు రూ.60 కోట్లు జ‌మ అయిన‌ వ్యవహారంపై మనీలాండరింగ్‌ నేరం కింద ఈడీ కేసు న‌మోదు చేసిన‌ట్లు వివ‌ర‌ణ ఇచ్చారు. ఈ కేసుకు సంబంధించిన అధికారుల‌ను తాము ప్ర‌శ్నించ‌నున్నామ‌ని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఈడీ అధికారుల అదుపులో ఇప్పటికే ఇద్దరు యాక్సిస్‌ బ్యాంకు మేనేజర్లు ఉన్నారు.

  • Loading...

More Telugu News