kcr: ఫేస్‌బుక్‌ ఖాతా తెరిచిన ముఖ్యమంత్రి కేసీఆర్


తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ అధికారిక ఫేస్‌బుక్ పేజీని తెరిచారు. కేసీఆర్ పేరుతో ఇప్ప‌టికే ప‌లు ఫేస్‌బుక్ పేజీలు ఉన్నాయి. అయితే, అవన్నీ న‌కిలీవే. తాజాగా కేసీఆర్‌ క్రియేట్ చేసుకున్న ఈ పేజీని ఫేస్‌బుక్ సంస్థ ఆమోదించి, వెరిఫైడ్ మార్క్‌ను పెట్టింది. పెద్ద‌నోట్ల ర‌ద్దు నేప‌థ్యంలో అంద‌రూ ఆన్‌లైన్ లావాదేవీల బాట‌ప‌ట్టాల‌ని, అంత‌ర్జాలం గురించి అవ‌గాహ‌న పెంచుకోవాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వం సూచిస్తోన్న విష‌యం తెలిసిందే. అయితే తాను కూడా ఆన్‌లైన్‌లో యాక్టివ్‌గా ఉండాల‌న్న ఉద్దేశంతో కేసీఆర్ అధికారికంగా ఫేస్‌బుక్ ఖాతాను ప్రారంభించారు. ఇన్ని రోజులు కేసీఆర్ పేరుతో ఉన్న‌ ఫేస్‌బుక్ ఖాతాల్లో ఆయ‌న‌ ప్రసంగాలను, ఫొటోల‌ను ఉంచేవారు. అయితే అవి కేసీఆర్ ఫాలో అవుతున్న అకౌంట్లు కాదు. ఆయ‌న పేరుతో ప‌లు అకౌంట్లు ఉండ‌డంతో నెటిజ‌న్లు తిక‌మ‌క‌ప‌డేవారు.

వాటిల్లో ఏ ఖాతా కేసీఆర్‌కి చెందిన నిజ‌మైన ఖాతానో తెలియ‌క అయోమ‌య‌ప‌డేవారు. ఇప్పుడు కేసీఆర్ అధికారిక ఖాతా తెరవడంతో కేసీఆర్ పేరుపై ఉన్న న‌కిలీ ఖాతాలన్నింటినీ మూసివేయాలని తెలంగాణ ప్రభుత్వం ఫేస్‌బుక్ సంస్థను కోరింది. కేసీఆర్ ఇటీవ‌లే పెద్దనోట్ల రద్దుపై శాసనమండలిలో ప్రసంగం చేసిన విష‌యం తెలిసిందే. ఆ ప్ర‌సంగాన్ని కేసీఆర్ తన అధికారిక‌ పేజీలో షేర్ చేశారు. అంతేకాదు ఫేస్‌బుక్ లైవ్ ద్వారా కేసీఆర్ త్వ‌ర‌లోనే త‌న ఫాలోవ‌ర్ల‌తో మాట్లాడేందుకు  ఏర్పాట్లు చేస్తున్నారు. త‌న‌ను అడుగుతున్న‌ ప్ర‌శ్న‌ల‌కు కేసీఆర్ స‌మాధానాలు చెప్ప‌నున్నారు.

  • Loading...

More Telugu News