telangana: తెలంగాణలోని వెనుకబడిన జిల్లాలకు రూ.450 కోట్లు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
తెలంగాణలోని వెనుకబడిన జిల్లాలకు కేంద్ర ప్రభుత్వం మరోసారి సాయం ప్రకటించింది. పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం 2015-16 సంవత్సరానికి రాష్ట్రంలోని వెనుకబడిన జిల్లాలకు రూ.450 కోట్లు విడుదల చేస్తున్నట్లు ఈ రోజు తెలిపింది. తెలంగాణకు కేంద్రం ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ సాయం కింద రూ.900 కోట్లు విడుదల చేసింది. తాజాగా విడుదల చేసిన రూ.450 కోట్లలో రాష్ట్రంలో వెనుకబడిన 9 జిల్లాలకు రూ.50 కోట్ల చొప్పున వినియోగించాలని చెప్పింది.