demonitisation: భారీ ఊర‌ట‌.. ఏటీఎంల నుంచి విత్‌డ్రా ప‌రిమితిని ఎత్తివేయ‌నున్న కేంద్ర ప్ర‌భుత్వం


పెద్ద‌నోట్లను ర‌ద్దు చేస్తూ కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న త‌రువాత న‌గ‌దు కొర‌త కార‌ణంగా ఏటీఎంల‌తో పాటు బ్యాంకుల్లో నగదు విత్ డ్రా ప‌రిమితిని పెట్టిన సంగ‌తి తెలిసిందే. ఏటీఎంల‌లో ప్ర‌స్తుతం ఒక‌సారి 2,500 తీసుకునే అవ‌కాశం ఉండ‌గా, బ్యాంకుల నుంచి 24 వేల వ‌ర‌కు తీసుకునే అవ‌కాశం ఉంది. అయితే, మ‌రో ప‌దిరోజుల్లో ప్ర‌ధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన గ‌డువు ముగుస్తుంది. అనంత‌రం వెంట‌నే ఏటీఎంల నుంచి విత్‌డ్రా చేయడానికి విధించిన ప‌రిమ‌తిని ఎత్తివేయ‌నున్నారు. డిసెంబ‌రు 30 త‌రువాత‌ బ్యాంకులు విధించే పరిమితిని బట్టి ఖాతాదారులు  ఏటీఎంల నుంచి త‌మ‌కు ఎంత కావాలంటే అంత తీసుకోడానికి అవకాశం ఉంటుంది. అలాగే బ్యాంకుల నుంచి విత్‌డ్రా చేసుకునే న‌గ‌దు మీద కూడా విధించిన ప‌రిమితిని ఎత్తేసే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల‌ 30వ తేదీ తర్వాత ప్ర‌జ‌లకు డ‌బ్బు కొరత అనేది ఉండబోదని ఆర్థికశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.

  • Loading...

More Telugu News