crime: దక్షిణ పాకిస్థాన్‌లో కొన్నేళ్లుగా దారుణ వ్య‌వ‌స్థ‌.. బానిసలుగానే జీవిస్తున్న 20 లక్షల మంది అమ్మాయిలు!


దక్షిణ పాకిస్థాన్‌లో కొన్నేళ్లుగా దారుణ వ్య‌వ‌స్థ‌ కొన‌సాగుతోంది. అప్పు తీసుకొని తిరిగి చెల్లించలేని స్థితిలో అమ్మాయిలను చెల్లింపుగా తీసుకుంటున్నారు. కొన్ని చోట్ల అప్పు ఇచ్చిన వ్య‌క్తులు అమ్మాయిల‌ను బానిస‌లుగా తీసుకుపోతోంటే, మ‌రి కొన్ని చోట్ల అప్పు తీర్చ‌లేని స్థితిలో త‌ల్లిదండ్రులే వారి కూతురిని అప్పు ఇచ్చిన వారింటికి పంపించేస్తున్నారు. అప్పు కింద వారిని తీసుకుంటున్న వ్యాపారుల్లో కొందరు స‌ద‌రు యువ‌తిని రెండో భార్యగా చేసుకుంటున్నారు. కాగా, మరికొంత‌మంది న‌గ‌దు కోసం ఆ యువ‌తుల‌ని వ్యభిచారంలోకి దించుతున్నారు. అప్పు చెల్లించ‌లేక త‌మ ఇంటికి వచ్చిన ఇతర మతాల యువ‌తుల‌ను ముస్లిం మతంలోకి మారుస్తున్నారు.

ఈ వ్య‌వ‌స్థ కార‌ణంగా త‌న కూతురిని పంపించిన ఓ తండ్రి మీడియాతో మాట్లాడుతూ పోలీసులు, న్యాయ‌స్థానాలు త‌మ బాధ‌ల‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని అన్నాడు. దక్షిణ పాకిస్థాన్ లో సుమారు 20 లక్షలకు పైగా యువ‌తులు బానిసలుగానే జీవిస్తున్నార‌ని గ్లోబల్ స్లేవరీ ఇండెక్స్-2016 తెలిపింది. ఇదే అంశంపై స్పందించిన మ‌రో సంస్థ ప్ర‌తి ఏడాది అక్క‌డ‌ వెయ్యికి పైగా క్రిస్టియన్, హిందూ మ‌తాల‌కు చెందిన యువ‌తులు ఇస్లాం మతంలోకి మారుతున్న‌ట్లు పేర్కొంది.

  • Loading...

More Telugu News