national herald: డాక్యుమెంట్లను సమర్పించాలన్న స్వామి పిటిషన్ కొట్టివేత.. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్కు ఊరట!
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేషనల్ హెరాల్డ్ కేసు ఈ రోజు మరోసారి విచారణకు వచ్చింది. ఈ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు ఆరోపణలు ఎదుర్కుంటున్న విషయం తెలిసిందే. నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లను కాంగ్రెస్ సమర్పించాలని బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి కోర్టును ఆశ్రయించారు. అయితే, ఈ పిటిషన్ను విచారించిన కోర్టు దాన్ని కొట్టివేస్తున్నట్లు పేర్కొంది. ఈ కేసులో తదుపరి విచారణను వచ్చే ఏడాది ఫిబ్రవరి 10కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో కాంగ్రెస్ కు కాస్త ఊరట లభించింది.