railways: ఇకపై రైల్వే స్టేషన్లే కల్యాణ మండపాలు... రైల్వే శాఖ వినూత్న ఆలోచన!
ప్రయాణికులు అతి తక్కువగా వుండే రైల్వే స్టేషన్‌లను ఇకపై ఫంక్షన్ల కోసం అద్దెకు ఇవ్వాలని రైల్వే శాఖ యోచిస్తోంది. ప్రయాణికుల బిజీ లేకుండా ఉన్న రైల్వే స్టేషన్లను అలా ఖాళీగా వదిలేసే బదులు వాటిని వివాహ వేడుకలతో పాటు ఇతర ఫంక్షన్ల కోసం ఎందుకు వాడకూడదని ఆలోచించి రైల్వేశాఖ ఈ ప్రతిపాదనను తీసుకొచ్చింది. ఇటీవలే న్యూఢిల్లీలో జరిగిన రైల్ వికాస్ శివిర్ మీటింగ్లో ఈ ఐడియా ప్రాణం పోసుకుందని, దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని రైల్వే బోర్డు అడ్వయిజర్ అలోక్ రాజన్ తెలిపారు. రైల్వే శాఖ అభివృద్ధికి వినూత్నమైన ఆలోచనలు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించినట్లు, అందుకు రోడ్ మ్యాప్ చేయాలని ఆదేశించినట్లు ఆయన పేర్కొన్నారు.