licence cancelled: 20 వేల స్వచ్ఛంద సంస్థల లైసెన్స్‌లు రద్దు
దేశంలో నిబంధనలను ఉల్లంఘిస్తూ నడిపిస్తోన్న 20 వేల స్వచ్ఛంద సంస్థల లైసెన్స్‌లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దేశంలో 13వేల స్వచ్ఛంద సంస్థలు మాత్రమే సరైన లైసెన్స్‌లు కలిగి ఉన్నాయని ఈ సందర్భంగా తెలిపింది. ఈ రోజు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ విదేశీయుల విభాగంపై సమీక్ష నిర్వహించిన సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దేశంలో మొత్తం 33 వేల స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయని, వీటిల్లో ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ చట్టాన్ని అతిక్రమించడంతో పాటు లైసెన్స్ విషయంలో తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించిన 20 వేల స్వచ్ఛంద సంస్థల లైసెన్సులను రద్దు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.