jayalalitha: జయలలిత మృతిపై మద్రాసు హైకోర్టు చేసిన వ్యాఖ్యలు బాధాకరం: అన్నాడీఎంకే
జయలలిత మృతిపై సందేహాలు వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్ విచారణకు వచ్చిన నేపథ్యంలో మద్రాసు హైకోర్టు జయలలిత మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ వ్యాఖ్యలు చేయడం పట్ల అన్నాడీఎంకే నేతలు స్పందించారు. జయలలిత ఆరోగ్యంపై అంతగోప్యత పాటించాల్సిన అవసరం ఏముందంటూ, ఆమె మృతదేహాన్ని మళ్లీ పరీక్షించాలని ఎందుకు ఆదేశించకూడదంటూ హైకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు బాధాకరమని అన్నాడీఎంకే అధికార ప్రతినిధి సీఆర్ సరస్వతి అన్నారు. కోర్టుకి అవసరం అనుకుంటే, అమ్మ మృతిపై అనుమానాలు ఉంటే కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి తెలుసుకోవచ్చని ఆమె వ్యాఖ్యానించారు. జయలలిత చెన్నయ్ ఆసుపత్రిలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రతిరోజు నివేదిక తీసుకుందని చెప్పారు.