samajvadi party: సమాజ్‌వాదీ పార్టీ కార్యాల‌యం వ‌ద్ద తీవ్ర ఉద్రిక్త‌త


ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని అధికార స‌మాజ్‌వాదీ పార్టీలో కుటుంబ క‌ల‌హాల కార‌ణంగా ఉద్రిక్త ప‌రిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ఈ రోజు ల‌క్నోలో ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి అఖిలేష్ యాద‌వ్‌ స‌మావేశం నిర్వ‌హించిన నేప‌థ్యంలో రాంగోపాల్ యాద‌వ్‌ను స‌స్పెండ్ చేస్తున్న‌ట్లు ములాయం సింగ్ యాద‌వ్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. దీంతో ములాయం తీరుపై భ‌గ్గుమ‌న్న అఖిలేష్ మ‌ద్ద‌తుదారులు, కార్య‌క‌ర్త‌లు ల‌క్నోలోని స‌మాజ్‌వాదీ పార్టీ కార్యాల‌యం వ‌ద్ద‌కు పెద్ద ఎత్తున దూసుకువ‌చ్చి పార్టీ కార్యాల‌యంలోని శివపాల్ యాద‌వ్ నామ‌ఫ‌ల‌కాన్ని ధ్వంసం చేశారు.

అనంత‌రం పార్టీ కార్యాల‌యానికి తాళం వేసి, పార్టీ కార్యాల‌యాన్ని స్వాధీనం చేసుకుంటున్నామని నినాదాలు చేశారు. అఖిలేష్ అనుచ‌రుల‌ను ములాయం మ‌ద్ద‌తుదారులు అడ్డుకోవాల‌ని చూశారు. దీంతో అక్క‌డ తోపులాట జ‌రిగింది. అక్క‌డికి భారీ ఎత్తున చేరుకున్న పోలీసులు ప‌రిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News