asaduddin: నరేంద్రమోదీ లక్ష్యంగా అసదుద్దీన్ ఒవైసీ విమర్శనాస్త్రాలు


ముంబ‌యి మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ) ఎన్నికల్లో భాగంగా హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నిన్న త‌మ‌ పార్టీ ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ప్రధాని నరేంద్రమోదీపై ఆయ‌న‌ విమర్శలు గుప్పించారు. ఇటీవ‌ల శివాజీ స్మారక స్థూపానికి ప్ర‌ధాని మోదీ భూమిపూజ చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ స‌మ‌యంతో మోదీ చేసిన‌ ప్ర‌సంగంలో భాగంగా శివాజీ సైన్యంలో సేవలు అందించిన ముస్లింల గురించి మాట్లాడ‌క‌పోవ‌డానికి కార‌ణ‌మేమిట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. అక్క‌డ నిర్మించనున్న శివాజీ మెమోరియల్‌ కోసం రూ.3,600 కోట్లను వినియోగించ‌డంపై త‌మకు అభ్యంత‌రం లేద‌ని, కానీ.. శివాజీ గొప్పతనం గురించిన మాట్లాడిన మోదీ ముస్లింల గురించి ప్రస్తావించలేదని ఆయ‌న అన్నారు.

శివాజీ సైన్యంలో ముస్లింలు కూడా ఉన్నారని, శివాజీ కోసం  పలువురు ముస్లింలు ప్రాణాలు కూడా కోల్పోయార‌ని ఒవైసీ వ్యాఖ్యానించారు. శివాజీ ఎన్నడూ రైతుల భూములను లాక్కోలేదని ఓవైసీ అన్నారు. అందుకే శివాజీ అంటే ప్రజలకి ఎంతో ఇష్ట‌మ‌ని ఆయ‌న అన్నారు. ఇప్పుడే గ‌నుక ఆయ‌న‌ బతికి ఉంటే తన పేరును వినియోగిస్తూ ప్రజాధనాన్ని వృథాగా ఖ‌ర్చుపెడుతున్న వారిని ఆయన ఏం చేసి ఉండేవారో అని ఒవైసీ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News