apple ceo: ప‌డిపోయిన యాపిల్‌ ఐఫోన్‌ అమ్మకాలు.. యాపిల్‌ సీఈవో వేతనంలో కోత!


ప్ర‌ముఖ ఎల‌క్ట్రానిక్ వ‌స్తువుల దిగ్గ‌జ సంస్థ యాపిల్ ఐపోన్‌ల అమ్మకాలు ప‌డిపోయాయి. యువ‌త‌కు ఐఫోన్‌ల‌పై ఉన్న క్రేజుతో లాభాల‌ను మ‌రింత పెంచుకున్న ఆ సంస్థ‌లో ఐఫోన్‌ల అమ్మ‌కాలు తొలిసారి త‌గ్గిపోయాయి. దీంతో యాపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌ వేతనంలో కోత ప‌డింది.  ప్రస్తుతం సెప్టెంబర్‌ 24తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి గానూ టిమ్ కుక్‌కు రూ.59.3 కోట్లు (8.7మిలియన్‌ డాలర్లు) చెల్లించినట్లు రెగ్యులేటరీకి ఆ సంస్థ తెలిపింది. అంతకు ముందు సంవత్సరం యాపిల్ సీఈవోకు సుమారు రూ.70 కోట్లు (10.3మిలియన్‌ డాలర్లు) చెల్లించారు.

ఆయ‌న‌తో పాటు త‌మ సంస్థ‌ టాప్‌ ఎగ్జిక్యూటీవ్‌ల వేతనాల్లోనూ కోత విధించినట్లు తెలుస్తోంది.  యాపిల్‌ ఆదాయం, నిర్వహణ లాభాలు ప‌డిపోవ‌డంతో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ సంస్థ రాబడులు గతంలో కంటే 8 శాతం పడిపోయి రూ.14,70,204 కోట్లకు చేరగా, నిర్వహణ లాభం 16 శాతం పడిపోయి 4,08,390 కోట్లకు చేరుకుంది. ఆ సంస్థ‌ 2007లో ఐఫోన్‌ల‌ను తీసుకొచ్చిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు లాభాలు సాధిస్తూ మంచి ఆదాయాలను న‌మోదు చేసుకుంది. ఇప్పుడు తొలిసారిగా ఆదాయం ప‌డిపోయింది.

  • Loading...

More Telugu News