suicide: ఇంట‌ర్నెట్‌లో 12 ఏళ్ల బాలిక సూసైడ్‌ వీడియో.. తొల‌గించ‌లేక‌పోతున్న పోలీసులు


12 ఏళ్ల బాలిక సూసైడ్‌ వీడియో ఇంట‌ర్నెట్‌లో విప‌రీతంగా వ్యాపిస్తోంది. దానిని నెట్‌లో నుంచి తొల‌గించడానికి పోలీసులు అష్ట‌క‌ష్టాలు ప‌డుతున్నారు. పేస్‌బుక్ లాంటి ప‌లు వెబ్‌సైట్‌ల నుంచి తొల‌గించిన‌ప్ప‌టికీ ప‌లు వెబ్‌సైట్‌ల‌లో ఆ వీడియో ద‌ర్శ‌న‌మిస్తూ క‌ల‌వ‌ర పెడుతోంది. ఆ వీడియోను చూస్తే చిన్నారులపై తీవ్ర‌ ప్రభావం ప‌డే అవ‌కాశం ఉంటుంద‌ని పోలీసులు అంటున్నారు. వివ‌రాల్లోకి వెళితే... అమెరికాలోని ఉత్తర జార్జియా ప్రాంతానికి చెందిన కాటెలిన్‌ నికోల్‌ డేవిస్‌ అనే 12 ఏళ్ల బాలిక గ‌త‌నెల‌ 30న చెట్టుకు తాడుతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.

అయితే, తాను ఆత్మ‌హ‌త్య చేసుకుంటుండ‌గా ఆ ప్రాంతంలో ఆ బాలిక ఓ ఫోన్‌ను అమర్చి రికార్డు అయ్యేలా చేసింది. 40 నిమిషాల నిడివి ఉన్న ఆ వీడియో ఫేస్‌బుక్‌ లైవ్‌లో పోస్టయింది. ఆ బాలిక ఆత్మ‌హ‌త్య చేసుకునే ముందు త‌న‌ను క్షమించాల‌ని పేర్కొంది. ఆ వీడియో వైరల్‌గా మారి, యూ ట్యూబ్‌తో పాటు ప‌లు వెబ్‌సైట్ల‌లో ద‌ర్శ‌నమిచ్చింది. ఆ వీడియోను ఇంట‌ర్నెట్‌లోంచి తొలగించడానికి ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని, ఇప్ప‌టికే పలు వెబ్‌సైట్ల నుంచి తొల‌గించిన‌ప్ప‌టికీ పూర్తిగా తొల‌గించానికి చేస్తోన్న త‌మ ప్ర‌య‌త్నాలు ఫలించడం లేదని పోలీసులు తెలిపారు. అనంత‌రం పోలీసుల‌కు ఆత్మహత్యకు పాల్పడిన ఆ బాలిక‌కు సంబంధించిన మ‌రో వీడియో కూడా ల‌భించింది. త‌మ‌ కుటుంబసభ్యుల్లోని ఒక వ్య‌క్తి తనపై లైంగిక వేధింపుల‌కు పాల్పడుతున్నారని ఆ బాలిక ఆ వీడియోలో చెప్పిన‌ట్లు అక్క‌డి మీడియాలో ఓ క‌థ‌నం వ‌చ్చింది.

  • Loading...

More Telugu News