jallikattu: ఇది తమిళుల నిరసన కాదు.. విప్లవం!: జల్లికట్టుపై హీరో విశాల్
తమ సంప్రదాయ క్రీడయిన జల్లికట్టును నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తమిళనాడు వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఈ రోజు హీరో విశాల్ మాట్లాడుతూ తాను కూడా వారి పోరాటానికి మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ అంశంపై చొరవ తీసుకోవాలని ఆయన కోరారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆర్డినెన్స్‌ను తీసుకువచ్చి, జల్లికట్టుకు అనుమతి ఇవ్వాలని అన్నారు. ప్రజల సెంటిమెంట్‌ను ప్రభుత్వం గౌరవించాలని పేర్కొన్నారు. జల్లికట్టుపై ప్రజలు చేస్తోంది నిరసన కాదని, ఇదో విప్లవమని ఆయన వ్యాఖ్యానించారు.