udhanam: ఉద్దానం కిడ్నీ బాధితులకు ఉచిత పరీక్షలు, మందులు


ఉద్దానం కిడ్నీ సమస్యల‌పై త‌మ ప్ర‌భుత్వం ఉద్యమస్ఫూర్తితో పనిచేస్తోందని ఆంధ్ర‌ప్ర‌దేశ్ వైద్య‌, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీ‌నివాస్ అన్నారు. ఈ రోజు శ్రీ‌కాకుళంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... కిడ్నీ వ్యాధి బాధితులకు ఉచిత పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేస్తామని తెలిపారు. అలాగే జిల్లాలోని కిడ్నీ ప్రభావిత ప్రాంతాలైన సోంపేట, పలాసల్లో రెండు నెల‌ల్లో డ‌యాలసిస్ సెంట‌ర్లు ఏర్పాటు చేస్తామ‌ని పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల్లో ఇప్పటివరకు జరిగిన సర్వేల్లో కిడ్నీ సంబంధిత సమస్యలు ఎందుకు వ‌స్తున్నాయో తేల‌లేద‌ని చెప్పారు. రేపటి నుంచి ప్రముఖ వైద్యుల ఆధ్వ‌ర్యంలో ఎయిమ్స్‌ బృందం పర్యటించనుందని చెప్పారు. అంతేగాక‌, వ‌చ్చేనెల‌ 6 నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి మరో బృందం శ్రీ‌కాకుళం చేరుకొని సర్వే చేస్తుందని తెలిపారు.

  • Loading...

More Telugu News