jallikattu: జల్లికట్టు కోసం అమెరికాలో కూడా ఆందోళనలు నిర్వహిస్తోన్న తమిళులు


జల్లికట్టు క్రీడ నిర్వహణకు శాశ్వత పరిష్కారం చూపాలని పట్టుబడుతూ తమిళనాడు వ్యాప్తంగా ఆ రాష్ట్ర ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున పోరాటం జ‌రుపుతున్న విష‌యం తెలిసిందే. ఆ క్రీడ‌కు మద్దతుగా ఇప్పుడు అమెరికాలో కూడా వంద‌ల సంఖ్యలో తమిళులు ఆందోళనకు దిగారు. అమెరికాలో ఉంటున్న త‌మిళులు ఈ రోజు వాషింగ్టన్‌లోని భారత ఎంబసీ ఎదుట ఉన్న గాంధీ విగ్రహం వద్ద ఈ నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌కు దిగారు. జల్లికట్టుపై నిషేధం ఎత్తేయాలని నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు. మ‌రోవైపు వర్జీనియాలోని నార్ఫోక్‌లో పెటా హెడ్‌క్వార్టర్స్‌ ఎదుట కూడా తమిళులు నిరస‌న తెలిపారు. పెటాకు వ్యతిరేకంగా ప్లకార్డులు, బ్యానర్లు ప్ర‌ద‌ర్శించారు. తాము కూడా జంతు ప్రేమికుల‌మేన‌ని, వాటితో ఎలా మెలగాలో తమకు తెలుసని ఓ త‌మిళ అమెరిక‌న్ అన్నాడు. జ‌ల్లిక‌ట్టు క్రీడ తమ సంస్కృతిలో భాగమని వ్యాఖ్యానించాడు.

  • Loading...

More Telugu News