akkineni: ఈ 29న సమంత, నాగ చైతన్యల నిశ్చితార్థ వేడుక!
సినీనటుడు అక్కినేని నాగార్జున చిన్నకుమారుడు అక్కినేని అఖిల్‌కి శ్రియా భూపాల్‌తో గత ఏడాది డిసెంబర్లో ఘనంగా నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. ఇక అక్కినేని నాగచైతన్య, సమంతల నిశ్చితార్థాన్ని ఈ నెల 29నే నిర్వహిస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ వేడుకకు హాజరుకావాల్సిందిగా ఇప్పటికే పలువురు సెలబ్రిటీలకు ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. సినీరంగ దిగ్గజాల ఫ్యామిలీలు ఈ వేడుకకు హాజరవుతున్నట్లు సమాచారం. సమంత, నాగ చైతన్య కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే.