google: తప్పుడు వ్యాపార ప్రకటనలపై కొరడా ఝళిపించిన గూగుల్


గ‌త‌ సంవ‌త్స‌రం త‌మ సంస్థ‌ 170 కోట్లకు పైగా యాడ్‌ల‌ను బ్యాన్ చేసినట్టు ప్ర‌ముఖ సెర్చింజ‌న్‌ గూగుల్ తెలిపింది. ఆ యాడ్‌ల‌న్నీ అక్రమ ఉత్పత్తులతో ఆఫర్లంటూ ఆక‌ర్షిస్తూ త‌మ‌ యూజర్లను తప్పుదోవ పట్టిస్తున్నాయ‌ని, అందుకే వాటిని బ్యాన్ చేశామ‌ని ఆ సంస్థ వార్షిక బెటర్ యాడ్స్ రిపోర్ట్స్ లో పేర్కొంది. ఆన్‌లైన్‌లో వ‌స్తోన్న త‌ప్పుడు ప్ర‌క‌ట‌న‌లు ఇంట‌ర్నెట్ యూజ‌ర్ల‌కు విసుగు తెప్పిస్తున్నాయని తెలిపింది. అంతేగాక, అవి యూజర్లకు హానికరంగా మారుతున్నాయని గూగుల్ పేర్కొంది. తమ ప్ర‌య‌త్నంలో భాగంగా ఆన్‌లైన్‌లో త‌ప్పుడు ప్రకటనలు త్వరలోనే తొల‌గిపోతాయ‌ని తెలిపింది.

హెల్త్ కేర్ ఉల్లంఘనల్లో 68 మిలియన్ యాడ్స్‌ను, అలాగే గాంబ్లింగ్ ఉల్లంఘనల్లో 17 మిలియన్ యాడ్‌ల‌ను తాము తొల‌గించిన‌ట్లు గూగుల్ తెలిపింది. అలాగే యూజ‌ర్ల‌ను ఆక‌ర్షిస్తూ త‌ప్పుడు స‌మాచారం అందిస్తోన్న‌ వెయిట్ లాస్ (బరువు తగ్గింపు) ఉత్పత్తులను ప్రమోట్ చేస్తున్న 47 వేల సైట్లపై కూడా తాము చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని తెలిపింది.

  • Loading...

More Telugu News