GodavariUS: ప్రెస్ నోట్: ట్రాయిట్లో ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైన గోదావరి సౌత్ ఇండియన్ రెస్టారెంట్
ప్రెస్ నోట్: కొలంబస్లో ఏర్పాటుచేసిన రెస్టారెంట్ ఘనవిజయం, మొట్టమొదటి సౌత్ ఇండియన్ ఫుడ్ ట్రక్ అమెరికాలో ఆదరణ పొందడం అనే ప్రత్యేకతలకు కొనసాగింపుగా `గోదావరి` డెట్రాయిట్ వాసులను అలరించేందుకుఅద్భుతమైన ఆహార పదార్థాలు మరియు విందు సౌలభ్యాలతో సిద్ధమైంది.
గోదావరి, (GODAVARI) అమెరికాలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దక్షిణ భారతదేశ వంటకాల రెస్టారెంట్ దిగ్గజం డెట్రాయిట్ లో జూలై 22, 2017లో తన నూతన రెస్టారెంట్‌ను ఏర్పాటు చేసేందుకు సర్వం సిద్ధంచేసుకుంది. పెద్ద సంఖ్యలో భారతీయుల నివాసాలు ఉన్న కీలక ప్రాంతమైన ఫర్మింగ్టన్ హిల్స్ లో గోదావరి డెట్రాయిట్ తన కొత్త రెస్టారెంట్‌ను ప్రారంభించనుంది.
గోదావరి డెట్రాయిట్ రెస్టారెంట్ సువిశాలమైన చక్కని ప్రాంతంలో కొలువుదీరి విషాలమైన పార్కింగ్ సౌలభ్యాన్ని కలిగి ఉండి తనదైన ముద్రను నిలబెట్టుకుంది. గోదావరి డెట్రాయిట్లో “పుష్కర” పేరుతో సిద్ధం చేసినఆకట్టుకునే బాంక్వెట్ హాల్ సుమారు 150 మందికి పైగా అతిథులు తమ వేడుకలు అట్టహాసంగా నిర్వహించుకునేలా తీర్చిదిద్దబడి ఉంది.
ఈ ప్రారంభోత్సవం సందర్భంగా గోదావరి డెట్రాయిట్ యజమాని రాజేశ్ తన ఉద్విగ్నభరిత సంతోషాన్ని పంచుకున్నారు. “సబ్వే ఫ్రాంచైజీని ఫర్మింగ్ టౌన్ హిల్స్ (Farmington Hills) ప్రాంతంలో గత పదేళ్లుగా నిర్వహిస్తున్నాం.ఈ క్రమంలో మేం దక్షిణాది భారతీయ వంటకాల రంగంలోకి అడుగుపెట్టాలని భావించాం. ఈ క్రమంలో ఇప్పటికే అత్యుత్తమ ఆదరణ పొందిన సౌత్ ఇండియన్ చెయిన్ `గోదావరి`ని ఎంపిక చేసుకున్నాం. మా ఎంపికమొదలయిన క్షణం నుంచి స్థలం ఎంపిక, ప్రారంభోత్సవం వరకు...ప్రతి దశలోనూ టీం గోదావరి మాకు వెన్నంటి ఉంటోంది” అని హర్షం వ్యక్తం చేశారు.
`గోదావరి`కి ప్రత్యేకమైన సాటిలేని వంటకాల రుచులు డెట్రాయిట్ భోజన ప్రియులను సైతం అలరించనున్నాయి. గోదావరి డెట్రాయిట్ ప్రారంభోత్సవం సందర్భంగా అద్భుతంగా సిద్ధం చేసిన లంచ్ బఫెట్ భోజన ప్రియుల కోసంసిద్ధంగా ఉంది. గోదావరి ప్రత్యేక వంటకాలైన “అమల అప్పడం బజ్జి”, “గోల్కొండ కోడి చిప్స్”, “పంప్‌సెట్ పీతల వేపుడు”, “అమరావతి పూర్ణాలు”, “మునియండి విలాస్ నాటు కోజి” తో పాటుగా అనేక పల్లెసీమల రుచులుఆహార ప్రియులను నోరూరించేందుకు సిద్ధంగా ఉన్నాయి.
“మేం టీం గోదావరి ద్వారా అమెరికా వ్యాప్తంగా ఉన్న భోజన ప్రియులకు అత్యుత్తమమైన దక్షిణ భారతీయ వంటకాలను అందించేందుకు నిరంతరం మా ప్రత్యేక శ్రమను కొనసాగిస్తున్నాం. ఉత్సాహభరితయువపారిశ్రామికవేత్తలుగా మేం కేవలం బ్రాండ్ నిర్మాణం కోసం మాత్రమే కాకుండా దక్షిణ భారతదేశ వంటకాల మైమరిపోయే రుచులను ప్రపంచవ్యాప్తంగా చేరవేస్తున్నాం. ఈ క్రమంలో అనేక నగరాల నుంచి తమకు గోదావరితోఅనుబంధం కొనసాగాలనే ఆసక్తి ఉందని తెలుపుతు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి” అని టీం గోదావరికి చెందిన వరుణ్ మేడిశెట్టి వివరించారు.
“బోస్టన్‌లో మా మొట్టమొదటి రెస్టారెంట్‌ను ప్రారంభించి కేవలం 26 నెలలే అయింది. ఇప్పుడు ప్రస్తుతం మేం 16 కేంద్రాల్లో మా సేవలను ఆత్మీయ అతిథులకు అందిస్తున్నాం. అంతేకాకుండా “స్పైసీ సలా” పేరుతోమొట్టమొదటి సౌత్ ఇండియన్ ఫుడ్ ట్రక్ ను నిర్వహిస్తున్నాం. ఇదంతా మా ప్రియమైన వినియోగదారుల ఆదరాభిమానాల వల్లే సాధ్యామైంది” అని గోదావరి సహ వ్యవస్థాపకులు తేజా చేకూరి తెలిపారు.
ప్రారంబోత్సవానికి సర్వం సిద్ధమైన గోదావరి డెట్రాయిట్ గోదావరి బ్రాండ్ కీర్తికిరీటంలో వజ్రంగా నిలిచి ఉండనుంది. ఆకట్టుకునే ప్రాంతం, చూడచక్కని వాతావరణం, అద్భుతమైన విందు అనుభూతుల సమ్మిళితంగా ఉన్నగోదావరి డెట్రాయిట్...తన వినియోగదారులకు మునుపెన్నడూ లేని ఆకర్షణీయమైన ఆహార రుచులను అందించనుంది. విభిన్నమైన వంటకాలతో అతిథుల మనసును దోచుకోనుంది.
మరిన్ని వివరాలకు సంప్రదించండి:
రాజేశ్ పి.
630-340-9760
[email protected]
రాజసంతో కూడిన రుచికరమైన గోదావరి లంచ్ విందుకి ఇదే సమయం…
మా రెస్టారెంట్ కొలువుదీరిన ప్రాంతం:
గోదావరి డెట్రాయిట్
35203 గ్రాండ్ రివర్ అవెన్యూ,
ఫర్మింగ్టన్, మిచిగాన్ 48335.
Ph: 248-987-6824.
అద్భుతమైన స్వాగతం, అత్యంత భారీ ఆదరణను అందించిన కొలంబస్, ఓహియో వాసులకు “టీం” గోదావరి తన ప్రత్యేక అభినందనలు ఈ సందర్భంగా తెలుపుతోంది. గోదావరి కొలంబస్ గ్రాండ్ ఓపెనింగ్ ట్రైలర్‌ను ఈ క్రింది వీడియోలో వీక్షించవచ్చు:
www.GodavariUS.com
Press note released by: Indian Clicks, LLC