rana: విడుదలకి ముందే లాభాల బాటలో 'నేనే రాజు నేనే మంత్రి'
రానా తాజా చిత్రం 'నేనే రాజు నేనే మంత్రి' కోసం అభిమానులంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కాజల్ కథానాయికగా నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలే వున్నాయి. కథా కథనాల పరంగా ఈ సినిమా ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేయడంతో, బిజినెస్ పరంగా కూడా మంచి హైప్ వచ్చింది. శాటిలైట్ బిజినెస్ కూడా ఒక రేంజ్ లో జరిగింది.
తెలుగు శాటిలైట్ రైట్స్ 3 కోట్లకు .. తమిళ శాటిలైట్ రైట్స్ 2 కోట్లకు .. మలయాళ శాటిలైట్ రైట్స్ 1.5 కోట్లకు .. హిందీ శాటిలైట్ రైట్స్ 7 కోట్లకు .. హిందీ డిజిటల్ రైట్స్ 2.5 కోట్లకు అమ్మకం జరిగినట్టుగా చెబుతున్నారు. ఈ సినిమాకి గల క్రేజ్ ను చూసిన సురేశ్ బాబు, థియేటర్స్ రైట్స్ ఎవరికీ అమ్మకుండా స్వయంగా డిస్ట్రిబ్యూట్ చేస్తే బాగుంటుందనే ఆలోచనలో వున్నాడట. ఈ విషయం పై ఆయన నిర్మాతలను ఒప్పించినట్టు సమాచారం.