ramayakrishna: మేగజైన్ ముఖచిత్రంపై గ్లామర్ ఒలికించిన రమ్యకృష్ణ!
నిన్నటితరం కథానాయికగా తెలుగు తెరపై రమ్యకృష్ణకి ప్రత్యేకమైన స్థానం వుంది. ప్రస్తుతం ఆమె తన వయసుకి తగిన కీలకమైన పాత్రలను పోషిస్తోంది. 'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమా వచ్చిన తరువాత, ఆమెలో కథానాయిక లక్షణాలు ఎంతమాత్రం తగ్గలేదని అభిమానులు చెప్పుకున్నారు.
ఇక లేటెస్ట్ గా ఆమె జే ఎఫ్ డబ్ల్యూ మేగజైన్ ముఖచిత్రంపై మెరిసింది. ఈ మేగజైన్ ముఖచిత్రం పై ఆమె లుక్ ను .. ఇచ్చిన స్టిల్ చూసిన వాళ్లంతా 'వావ్' అంటున్నారు. 46 పైబడిన వయసులోను ఆమె ఇంత గ్లామరస్ గా కనిపిస్తూ ఉండటం రియల్లీ గ్రేట్ అంటున్నారు. చిరంజీవి .. బాలకృష్ణ .. వెంకటేశ్ వంటి సీనియర్ కథానాయకుల సరసన కూడా మళ్లీ కథానాయికగా అలరించేంత గ్లామర్ ఆమె సొంతమని చెప్పుకుంటున్నారు. అలా జరిగే అవకాశం కూడా లేకపోలేదు.