nagachaitanya: కాలేజ్ స్టూడెంట్స్ పై దృష్టి పెట్టిన హీరోలు!
ఈ మధ్య కాలంలో యూత్ కి కనెక్టయ్యే కథలపైనే హీరోలు .. దర్శక నిర్మాతలు ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. అందువలన తమ సినిమాల విడుదల సమయంలో ప్రమోషన్స్ లో భాగంగా యూత్ కి దగ్గర కావడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకోసం ఏకంగా కాలేజ్ లకు వెళుతున్నారు. తమ సినిమా విశేషాలను గురించి చెబుతూ, వాళ్లతో కల్సి ఆటపాటలతో సందడి చేస్తున్నారు.
'కేశవ' సినిమా సమయంలో నిఖిల్ .. 'నేనే రాజు నేనే మంత్రి' విడుదల సమయంలో రానా .. 'అర్జున్ రెడ్డి' సమయంలో విజయ్ దేవరకొండ ఆయా ప్రాంతాల్లోని కాలేజ్ లను ఎంచుకుని అక్కడ సందడి చేశారు. ఆ సినిమాలన్నీ కూడా హిట్ కావడంతో .. చైతూ కూడా అదే పని చేశాడు. ఈ నెల 8వ తేదీ 'యుద్ధం శరణం' రిలీజ్ ఉండటంతో, వైజాగ్ లోని ఓ ఇంజనీరింగ్ కాలేజ్ కి వెళ్లాడు. అక్కడి స్టూడెంట్స్ తో ఈ సినిమా విశేషాలను పంచుకున్నాడు .. వాళ్లతో కలిసి సందడి చేశాడు .. సెల్ఫీలు దిగాడు.