gold rate: తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర
మార్కెట్లో నిన్న భారీగా పెరిగిపోయిన బంగారం ధర ఈ రోజు మాత్రం కాస్త తగ్గింది. స్థానిక బంగారు దుకాణదారుల నుంచి డిమాండ్ తగ్గడంతో 10 గ్రాముల బంగారం ధర ఈ రోజు 100 రూపాయలు పడిపోయి రూ.30, 900గా నమోదైంది. మరోవైపు వెండి ధర మాత్రం రూ.100 పెరిగి కిలో వెండి ధర రూ.41,600గా నమోదైంది. గ్లోబల్ మార్కెట్లో బంగారం ధర 0.20 శాతం పడిపోయి, సింగపూర్ ఔన్స్ బంగారం ధర 1,326.30 డాలర్లుగా నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధరలు చెరో 100 రూపాయల చొప్పున పడిపోయి రూ.30,900, రూ.30,750 కి చేరింది.