NAG AKHIL: నాన్నతో సెల్ఫీ దిగి ఓ విషయాన్ని చెప్పిన అఖిల్!


తన తండ్రి అక్కినేని నాగార్జునతో కలిసి సెల్ఫీ దిగిన నటుడు అఖిల్ దాన్ని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ ఓ విష‌యాన్ని తెలిపాడు. ఈ ఫొటో తాను న‌టిస్తోన్న‌ ‘హలో’ సినిమా కోసం కాదని, తాను తన తండ్రితో క‌లిసి మొద‌టిసారి ఓ ప్రకటనలో నటిస్తున్నాన‌ని అఖిల్ చెప్పాడు. దానికి ‘కింగ్‌ సెల్ఫీ’ అనే హ్యాష్‌ ట్యాగ్‌ను పెట్టాడు. వీరిరువురూ త్వ‌ర‌లోనే ఓ షాపింగ్‌మాల్ ప్ర‌క‌ట‌న‌లో క‌న‌ప‌డ‌నున్నారు. ‘మనం’ సినిమా క్లైమాక్స్‌లో ఎంట్రీ ఇచ్చి త‌న తాత‌, తండ్రి, సోద‌రుడితో వెండి తెర‌పై క‌న‌ప‌డిన అఖిల్.. ఆ త‌రువాత హీరోగా 'అఖిల్' సినిమాలో న‌టించాడు. ప్ర‌స్తుతం ఆయ‌న న‌టిస్తోన్న‘హలో’ సినిమాలో కల్యాణి ప్రియదర్శిని హీరోయిన్‌ గా నటిస్తోంది.    

  • Loading...

More Telugu News