d.trump: ఉ.కొరియాను రెచ్చ‌గొట్టిన డొనాల్డ్ ట్రంప్!

  • దక్షిణ కొరియా అధ్యక్షుడికి ట్రంఫ్ ఫోన్
  • ఉ.కొరియా అధ్య‌క్షుడిని రాకెట్ మెన్ గా అభివర్ణించిన ట్రంప్ 
  • ఉత్త‌ర‌కొరియాకు అమెరికా హెచ్చ‌రిక‌లు
  • యుద్ధ ప‌రిస్థితులు తప్పేలా లేవు: నిక్కీ హేలీ

శత్రుదేశాల‌ను స‌ర్వ‌నాశ‌నం చేసేస్తాం అంటూ వ‌రుసగా క్షిప‌ణి ప్ర‌యోగాలు చేస్తూ ఆందోళ‌నక‌ర ప‌రిస్థితులను నెల‌కొల్పుతోన్న‌ ఉత్త‌ర‌కొరియాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ రెచ్చగొట్టే వ్యాఖ్య‌లు చేశారు. కొన్ని రోజుల క్రితం దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌ జై ఇన్‌కు ఫోన్ చేసిన ట్రంప్‌.. ఆ విష‌యాన్ని తాజాగా తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌తో ఏం మాట్లాడాడో కూడా తెలిపి, అల‌జ‌డి రేపారు. తాను ద‌క్షిణ కొరియా అధ్య‌క్షుడితో మాట్లాడుతూ రాకెట్‌ మెన్ (ఉ.కొరియా అధ్య‌క్షుడు) ఏం చేస్తున్నాడని అడిగాన‌ని చెప్పారు. సుదూరాల నుంచి గ్యాస్‌ పైపు లైన్‌ నిర్మిస్తున్నాడా? ఇది ఏం బాగోలేదు అని తాను అన్నట్లు ట్రంప్ తెలిపారు. మ‌రోవైపు ట్రంప్‌ సలహాదారులు ఉత్త‌ర‌కొరియాకు హెచ్చ‌రిక‌లు చేస్తూ తీరు మార్చుకోవాల‌ని పేర్కొన్నారు.  
 
కాగా, ఉత్తరకొరియా ఆంక్షల తీవ్రత ఏంటో తెలుసుకుంటోంద‌ని ఐక్య‌రాజ్య సమితిలో అమెరికా ప్రతినిధి నిక్కీ హేలీ అన్నారు. ఆ దేశం ఏకాకిగా మారుతోంద‌ని తెలిపారు. అలాగే దౌత్య, సైనికేతర పరిష్కారాలకు మార్గాలు దూరమైపోతున్నాయని చెప్పారు. ఉత్తరకొరియా తీరు ఇలాగే ఉంటే యుద్ధ ప‌రిస్థితులు తప్పేలా లేవ‌ని, యుద్ధం జ‌రిగితే ఆ దేశం స‌ర్వ‌నాశ‌నం అయిపోతుంద‌ని ఆమె అన్నారు.

  • Loading...

More Telugu News