america: ఉత్తరకొరియాను అమెరికా ఆక్రమిస్తుంది: అంతర్జాతీయ మహిళా జర్నలిస్టు జోస్యం

  • ఇరాక్ పరిస్థితిని ఉత్తరకొరియాలో పునరావృతం చేయాలని అమెరికా భావిస్తోంది
  • అమెరికా శక్తి సామర్థ్యాల ముందు ఉత్తరకొరియా నిలువలేదు
  • యుద్ధం జరిగితే ఉత్తరకొరియాతో పాటు దక్షిణ కొరియా కూడా తీవ్రంగా నష్టపోతుంది
  • ఉత్తరకొరియా ఓటమి ఖాయం

ఉత్తరకొరియాను అమెరికా ఆక్రమిస్తుందని అంతర్జాతీయ మహిళా జర్నలిస్టు లారెన్ రోజెన్ తెలిపారు. వాషింగ్టన్ లో నిర్వహించిన సదస్సులో ఆమె మాట్లాడుతూ, అచ్చం ఇరాక్ లో నెలకొన్న పరిస్థితిని ఉత్తరకొరియాలో పునరావృతం చేయాలని అమెరికా ప్రయత్నిస్తోందని అన్నారు. అమెరికా శక్తి సామర్థ్యాల ముందు ఉత్తరకొరియా నిలువలేదని ఆమె స్పష్టం చేశారు. దీంతో ఉత్తరకొరియా తీవ్రంగా నష్టపోతుందని ఆమె అన్నారు.

ఈ క్రమంలో ఉత్తరకొరియాతోపాటు దక్షిణ కొరియా కూడా తీవ్రంగా నష్టపోనుందని ఆమె హెచ్చరించారు. అమెరికాతో యుద్ధానికి దిగితే ఉత్తరకొరియా ఓడిపోతుందని, తరువాత ఆ దేశాన్ని అమెరికా ఆక్రమిస్తుందని ఆమె జోస్యం చెప్పారు. కాగా, ఆమె 'ఆల్ మానిటర్' అనే అంతర్జాతీయ మీడియా సంస్థలో పని చేస్తున్నారు. 

  • Loading...

More Telugu News