ttd steps: తిరుమల మెట్ల మార్గంలో భక్తులను పరుగులు పెట్టించిన కొండ చిలువ!
తిరుమల శ్రీవారిని చేరుకునే మెట్ల మార్గంలో భారీ కొండచిలువ వెంకన్న భక్తులను బెంబేలెత్తించి పరుగులు పెట్టించింది. నిన్న తిరుమలలో భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో అడవిలోని ఏ మూల నుంచి వచ్చిందో కానీ... సుమారు 15 అడుగుల పొడవు ఉన్న భారీ కొండచిలువ శ్రీవారి మెట్ల దగ్గరకు నెమ్మదిగా వచ్చింది. ఏదో తినడం వల్ల కదలలేక కదులుతూ మెట్ల మార్గంలో వెళ్లే భక్తులను భయపెట్టింది. దీంతో పలువురు యువకులు కొండచిలువ ఫోటోలు, వీడియో తీసి తిరుమల అధికారులకు సమాచారం అందించడంతో వారు వచ్చి, దానిని పట్టుకుని అడవిలో వదిలేశారు.