mumbai: ముంబై ఎయిర్ పోర్ట్ రన్ వేపై స్కిడ్ అయిన స్పైస్ జెట్ విమానం... శంషాబాద్ ఎయిర్ పోర్టు ఫుల్ బిజీ
- ముంబైని ముంచెత్తిన భారీ వర్షం
- ఎయిర్ పోర్టులోకి వరద నీరు
- రన్ వే పై నిలిచిపోయిన స్పైస్ జెట్ విమానం
- విమాన రాకపోకలకు ఇబ్బంది
- శంషాబాద్ కు అంతర్జాతీయ విమానాల దారి మళ్లింపు
ముంబై మహానగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. భారీగా కురిసిన వర్షం ధాటికి ముంబై నగరం నీటిమయమైంది. ఒక్కసారిగా ఛత్రపతి శివాజీ టెర్మినస్ లోకి వరదనీరు చేరింది. రన్ వే మొత్తం జలాశయాన్ని తలపించింది. ఈ క్రమంలో ల్యాండ్ అయిన స్పైస్ జెట్ విమానం రన్ వేపై స్కిడ్ అయింది. దీంతో విమాన రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. విమానాశ్రయాన్ని ముంచెత్తిన నీటి పరిమాణం పెరుగుతుండడంతో అంతర్జాతీయ విమానాలను ముంబై నుంచి హైదరాబాదులోని శంషాబాదులో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి దారి మళ్లించారు. దేశీయ విమానాలను దగ్గర్లోని ఇతర విమానాశ్రయాలకు మళ్లించారు. దీంతో శంషాబాద్ ఎయిర్ పోర్టు బిజీగా మారింది.