interconnect usage charges: ఇంటర్‌కనెక్ట్ యూసేజ్ ఛార్జీలను తగ్గించిన ట్రాయ్
- 14 పైసల నుంచి 6 పైసలకు తగ్గింపు
- అక్టోబర్ 1 నుంచి అమలు
- టెలికాం కంపెనీలపై మరో దెబ్బ
- కాల్ ఛార్జీలను పెంచి భారాన్ని వినియోగదారులపైకి మళ్లించే అవకాశం
వేర్వేరు మొబైల్ కంపెనీల మధ్య కొనసాగే వాయిస్ కాల్స్‌పై విధించే ఇంటర్‌కనెక్ట్ యూసేజ్ ఛార్జీల (ఐయూసీ)ను తగ్గిస్తూ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) నిర్ణయం తీసుకుంది. గతంలో విధించే 14 పైసల నుంచి 6 పైసలకు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. అక్టోబర్ 1 నుంచి ఈ ఛార్జీలు అందుబాటులోకి రానున్నాయి. అలాగే 2020 జనవరి 1 నుంచి దేశీయ కాల్స్‌పై ఐయూసీని పూర్తిగా నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. అయితే ఈ నిర్ణయంతో ఎయిర్టెల్, వొడాఫోన్ లాంటి కంపెనీలపై భారం పడనుంది. ఇప్పటికే జియో దెబ్బతో నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న ఈ కంపెనీలు ఆ భారాన్ని వినియోగదారుల వైపుకి మళ్లించడానికి కాల్ ఛార్జీలను పెంచే అవకాశం కూడా ఉంది.