sagarika: భారత రహస్య క్షిపణుల గురించి అమెరికాకు తెలుసు: స్నోడెన్
- సాగరిక, ధనుష్ క్షిపణులను రహస్యంగా రూపొందించిన భారత్
- భారత్‌కు సంబంధించిన చాలా విషయాలు యూఎస్‌కి తెలుసు
- వెల్లడించిన స్నోడెన్ డాక్యుమెంట్లు
అమెరికా సీక్రెట్ ఏజెన్సీ ఎన్ఎస్ఏకి భారత్‌కి సంబంధించిన రహస్య క్షిపణి కార్యక్రమాల గురించి ముందే తెలుసని అమెరికన్ విజిల్ బ్లోయర్ ఎడ్వర్డ్ స్నోడెన్ విడుదల చేసిన పత్రాలు తెలియజేస్తున్నాయి. 2005లో భారత్ రూపొందించిన సాగరిక, ధనుష్ క్షిపణుల ప్రయోగం గురించి అమెరికాకు తెలుసనని `ద ఇంటర్సెప్ట్` అనే వెబ్సైట్ పబ్లిష్ చేసింది. అమెరికా చేపట్టిన అంతర్జాతీయ నిఘా కార్యక్రమాల గురించి బయటికి చెప్పిన ఎడ్వర్డ్ స్నోడెన్ ఈ పత్రాలను బయటపెట్టినట్లు వెబ్సైట్ పేర్కొంది. అలాగే భారత్ తయారు చేసిన న్యూక్లియర్ బాంబులు కూడా ఎక్కడున్నాయనే సంగతి అమెరికాకు తెలుసుననే విషయం ఈ పత్రాల్లో ఉంది. సబ్‌మెరైన్ సహాయంతో పేల్చగల సాగరిక పరిధి 700 కి.మీ.లు. అలాగే సముద్రం నుంచి ప్రయోగించగల ధనుష్ పరిధి 350 కి.మీ.లు. వీటిని వరుసగా 2008, 2016లో భారత్ ప్రయోగించింది.