sai: సినిమా కబుర్లు... సంక్షిప్త సమాచారం!

  • నాలుగేళ్ల పాపకు తల్లిగా సాయిపల్లవి 
  • 'మహానుభావుడు' సెన్సార్ పూర్తి 
  • 'అదిరింది'కి డబ్బింగ్ మొదలు 
  • విక్రం హిట్ చిత్రానికి సీక్వెల్

*  'ఫిదా' సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల హృదయాలు దోచేసిన సాయిపల్లవి త్వరలో 'కణం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. నాగశౌర్య హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో నాలుగేళ్ల పాపకు తల్లిగా సాయిపల్లవి నటిస్తోంది. గర్భస్రావం అంశంపై ఈ చిత్రకథ సాగుతుందట.  
*  శర్వానంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందిన 'మహానుభావుడు' చిత్రం సెన్సార్ పూర్తయింది. దీనికి సెన్సార్ నుంచి U/A సర్టిఫికేట్ లభించింది. మెహ్రీన్ కథానాయికగా నటించిన ఈ వినోదాత్మక చిత్రాన్ని ఈ నెల 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.
*  తమిళ స్టార్ విజయ్ నటిస్తున్న 61వ చిత్రాన్ని 'అదిరింది' పేరిట తెలుగులోకి డబ్ చేస్తున్నారు. ఈ చిత్రం తెలుగు డబ్బింగ్ పనులు మొదలయ్యాయి. అట్లీ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం టీజర్, ఆడియోను త్వరలో రిలీజ్ చేస్తారు. ఇందులో కాజల్, సమంత, నిత్యా మీనన్ హీరోయిన్లుగా నటించారు.    
*  విక్రం హీరోగా గతంలో 'సామి' పేరుతో వచ్చిన హిట్ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ నిర్మించే పని జరుగుతోంది. హరి దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రంలో త్రిష, కీర్తి సురేష్ హీరోయిన్లుగా నటిస్తారు.  

  • Loading...

More Telugu News