yadav: డేవిడ్ వార్నర్ కు సవాల్ విసిరిన టీమిండియా 'చైనామన్' బౌలర్
- వార్నర్ బలహీనత నాకు తెలుసు
- వార్నర్ వికెట్ నాదే
- వార్నర్ ను సులువుగా అవుట్ చేస్తా
- నా బౌలింగ్ లో ఒత్తిడికి గురై తడబడతాడు
- ఇప్పటికే రెండు సార్లు అవుట్ చేశా
- తోడుగా చాహల్ ఉండడంతో పని సులువవుతోంది
టీమిండియా 'చైనామన్' బౌలర్ కుల్దీప్ యాదవ్ ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కు సవాల్ విసిరాడు. వార్నర్ ను ఆరంభంలోనే అవుట్ చేస్తానని సవాల్ విసిరాడు. తన బౌలింగ్ ఎదుర్కోవడంలో వార్నర్ ఒత్తిడికి గురవుతూ, తడబడుతున్నాడని తెలిపాడు. అలాంటి బ్యాట్స్ మన్ ను అవుట్ చేయడం చాలా సులభమని కుల్దీప్ యాదవ్ వెల్లడించాడు. ఇది వరకు రెండు సార్లు వార్నర్ ను తాను అవుట్ చేశానని గుర్తు చేశాడు.
తొలి వన్డేలో వార్నర్ ను అవుట్ చేయడం తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని అన్నాడు. ఆ విశ్వాసంతోనే చెబుతున్నానని ఈ చైనామన్ బౌలర్ తెలిపాడు. వార్నర్ బలహీనత తనకు తెలుసని, అందుకే అతనిని ఎలాగైనా అవుట్ చేయగలనని ఆత్మవిశ్వాసం ప్రదర్శించాడు. స్టీవ్ స్మిత్ బౌలర్లను చదువుతాడని, అతనికి బౌలింగ్ చేయడం కష్టమని అన్నాడు. అయితే చాహల్ లాంటి మణికట్టు స్పిన్నర్ ఉండడంతో ఆసీస్ కు కష్టాలు తప్పవని చెప్పాడు. కాగా, మరికొన్ని గంటల్లో రెండో వన్డే ప్రారంభం కానుంది.