central government: గుట్టు విప్పు... కోటి పట్టు: కేంద్రం కొత్త ఆఫర్
- 'బినామీ గుట్టు విప్పు.. నజరానా పట్టు' పథకం
- బినామీల గుట్టు విప్పేందుకు ప్రజల సాయం కోరిన కేంద్రం
- రహస్యాలు చెప్పిన వారి వివరాలు గోప్యం
- బినామీల వివరాలు చెప్పిన వారికి పట్టుబడ్డ ఆస్తిని బట్టి నజరానా
- 15 లక్షల రూపాయల నుంచి కోటి రూపాయల నజరానా
కేంద్ర ప్రభుత్వం సరికొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. బినామీల గుట్టు విప్పేందుకు దేశప్రజల సహకారం తీసుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ పథకంలో భాగంగా బినామీ ఆస్తుల గుట్టు విప్పేవారికి భారీ నజరానా ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోందని తెలుస్తోంది. బినామీ ఆస్తుల వివరాలు అందించిన వారి సమాచారం విలువను బట్టి కనిష్టంగా 15 లక్షల రూపాయల నుంచి కోటి రూపాయలు నజరానాగా ఇవ్వాలని నిర్ణయించింది.
అలాగే సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతారు. ప్రస్తుతం ఉన్న విధానంతో బినామీల ఆటకట్టడం కష్టంగా ఉందని, అదే ఇన్ఫార్మర్ విధానాన్ని తీసుకొచ్చి, రక్షణ కల్పిస్తే బినామీల గురించి ప్రజలే చూసుకుంటారని కేంద్రం భావిస్తోంది. ఈ నేపథ్యంలో త్వరలోనే ఈ పథకాన్ని అమలులోకి తీసుకురానుందని సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ (సీబీడీటీ) ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.