nawaz sharif: నవాజ్ షరీఫ్ ఖాతాల స్తంభన.. ఆస్తుల జప్తు!
- నవాజ్ షరీఫ్ కు షాక్
- పనామా పేపర్స్ ఆరోపణలతో ప్రధాని పదవి వదులుకున్న నవాజ్ షరీఫ్
- లండన్ లో ఉన్న నవాజ్ షరీఫ్
- లాహోర్ లోని ఆయన నివాసానికి జప్తు నోటీసు అంటించిన అధికారులు
పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కు మరోషాక్ తగిలింది. పనామా పేపర్స్ లో అక్రమ ఆస్తులు కూడబెట్టారంటూ వచ్చిన కథనాలపై విచారణ చేపట్టిన పాక్ అత్యున్నత అవినీతి నిరోధక సంస్థ నేషనల్ అకౌంటబులిటీ బ్యూరో (ఎన్ఏబీ) నవాజ్ షరీఫ్, అతని కుటుంబ సభ్యుల ఖాతాలు నిలిపివేయాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ తో పాటు ఇతర ప్రైవేటు బ్యాంకులకు ఎన్ఏబీ లేఖలు రాసిందని ఉన్నతాధికారులు తెలిపారు.
అలాగే ఆయన ఆస్తులు జప్తు చేస్తున్నట్టు లాహోర్ శివార్లలోని ఆయన నివాసం బయట నోటీసులు అంటించారు. కాగా, నవాజ్ షరీఫ్ ప్రస్తుతం లండన్ లో ఉన్నారు. అనారోగ్యం కారణంగా ఆయన భార్య ఆసుపత్రిలో చేరడంతో ఆయన లండన్ లో ఉన్నారు.