india: డబుల్ సెంచరీల ఇండోర్ స్టేడియం... నేడు ఎవరిదో ఈ లక్కీ పిచ్!
- నేడు ఇండోర్ లోని హోల్కర్ స్టేడియంలో మ్యాచ్
- తలపడనున్న ఆస్ట్రేలియా, ఇండియా
- గతంలో సెహ్వాగ్, కోహ్లీలు డబుల్ సెంచరీలు సాధించిన పిచ్
- సాధారణ మైదానంతో పోలిస్తే దగ్గరగా బౌండరీ లైన్
ఇండోర్ లోని హోల్కర్ స్టేడియం. నేడు భారత్, ఆస్ట్రేలియాల నడుమ మూడో వన్డేకు ఆతిథ్యమిస్తున్న సంగతి తెలిసిందే. ఈ స్టేడియంలో ఎప్పుడు మ్యాచ్ జరిగినా పరుగుల వరద ఖాయం. అది కూడా అలా ఇలా కాదు... సాధారణ క్రికెట్ మైదానాలతో పోలిస్తే, హోల్కర్ స్టేడియంలో బౌండరీ లైన్ 5 నుంచి 10 మీటర్ల వరకూ తక్కువగా ఉంటుంది. దీంతో ఓ మోస్తరు షాట్ కూడా బౌండరీని తాకుతుంది. దీంతో ఇక్కడ సెంచరీల వర్షం కురుస్తూ ఉంటుంది. ఇది టీమిండియాకు లక్కీ స్టేడియం కూడా.
ఇక్కడే 2011లో వీరేంద్ర సెహ్వాగ్ వన్డేల్లో డబుల్ సెంచరీ కొట్టాడు. గత సంవత్సరం న్యూజిలాండ్ తో జరిగిన టెస్టు మ్యాచ్ లో విరాట్ కోహ్లీ కూడా డబుల్ సెంచరీ బాదేశాడు. మొత్తంగా ఈ స్టేడియం భారత క్రికెట్ జట్టుకు ఎన్నో మరపురాని విజయాలు అందించింది. అటువంటి పిచ్ పై నేడు గెలిచి, మరో రెండు మ్యాచ్ లు మిగిలి వుండగానే సిరీస్ ను సొంతం చేసుకోవాలని కోహ్లీ సేన భావిస్తోంది. ఇప్పుడు టీమిండియా ఫామ్ చూస్తే గెలుపు పెద్ద విషయమేమీ కాదు. ఇదే సమయంలో హోల్కర్ స్టేడియంలోని లక్కీ పిచ్ ఎవరికి అచ్చొస్తుందో వేచి చూడాలి.