andhra pradesh: 24 గంటల పాటు భారీ వర్షాలు... ఏపీ, టీఎస్ లకు వాతావరణ శాఖ హెచ్చరికలు!
- కోస్తాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు
- ఉపరితల ఆవర్తనానికి తోడైన ద్రోణి
- తెలంగాణలోనూ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ
వచ్చే 24 గంటల వ్యవధిలో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో అత్యధిక ప్రాంతాల్లో, తెలంగాణలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాలో కొన్ని ప్రాంతాల్లో మరింత ఎక్కువ వర్షపాతం నమోదు కావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, దీనికి అనుబంధంగా ఉత్తర అండమాన్ ను ఆనుకుని మార్టబన్ ప్రాంతంలో మరో ఆవర్తనం కొనసాగుతోందని వెల్లడించిన వాతావరణ శాఖ, మరోవైపు దక్షిణ బంగాళాఖాతం మీదుగా కేరళ వరకూ ద్రోణి కొనసాగుతోందని తెలిపింది. వీటి ప్రభావంతో భారీ వర్షాలకు అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.