chandra babu: ముస్సోరి శిక్షణ కేంద్రంలో అధ్యాపకుడైన చంద్రబాబు!
- సీనియర్ ఐఏఎస్, ట్రైనీ ఐఏఎస్ అధికారులను ఉద్దేశించి సీఎం ప్రసంగం
- టెక్నాలజీ వినియోగంపై వ్యవస్థలు ఆధారపడి పనిచేస్తున్నాయి
- రాజధాని నిర్మాణంలో పలు ఆకృతులను నిశితంగా పరిశీలిస్తున్నాం
- సౌర, పవన విద్యుత్ ఉత్పత్తికి ప్రాధాన్యం ఇస్తున్నాం
- అన్ని గ్రామాల్లో రహదారుల నిర్మాణమే లక్ష్యం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యాపకుడిలా మారారు. ఉత్తరాఖండ్ ముస్సోరీలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో వివిధ రాష్ట్రాలకు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారులు, ఫౌండేషన్ కోర్సులో ఉన్న ట్రైనీ అధికారుల సంయుక్త సమావేశాన్ని నిర్వహించారు. వారిని ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ... టెక్నాలజీ వినియోగంపై వ్యవస్థలు ఆధారపడి పనిచేస్తున్నాయని చెప్పారు.
ఏపీ విభజన అనంతరం కొత్త రాజధాని అమరావతిని నిర్మించుకునే పనిలో తాము ఉన్నామని చెప్పారు. రాజధాని నిర్మాణంలో పలు ఆకృతులను నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపారు. సౌర, పవన విద్యుత్ ఉత్పత్తికి ప్రాధాన్యం ఇస్తున్నామని అన్నారు. అన్ని గ్రామాల్లో రహదారుల నిర్మాణం లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు.