sbi: శుభవార్త.. కనీస నిల్వ పరిమితిని తగ్గించిన ఎస్‌బీఐ!
- సేవింగ్స్ ఖాతాలో కనీస నిల్వ పరిమితి రూ.5 వేల నుంచి రూ.3 వేలకు తగ్గింపు
- కనీస నిల్వ పరిమితి నుంచి పింఛనర్లు, మైనర్ల ఖాతాలకు మినహాయింపు
- ప్రభుత్వ పథకాల ఖాతాలకు కూడా ఈ నిబంధన నుంచి మినహాయింపు
బ్యాంకుల్లో సేవింగ్స్ ఖాతాలో కనీసం రూ.5000 ఉండాల్సిందేనంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని నెలల ముందు నిబంధనను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఖాతాదారుల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతుండడంతో ఈ రోజు కనీస నిల్వ (మినిమం బ్యాలెన్స్) పరిమితిని తగ్గించింది.
మెట్రోపాలిటన్ నగరాల్లో కనీస నిల్వ పరిమితిని రూ.5 వేల నుంచి రూ.3 వేలకు తగ్గిస్తున్నట్లు పేర్కొంది. అంతేకాదు, కనీస నిల్వ పరిమితి నుంచి పింఛనర్లు, మైనర్ల ఖాతాలకు మినహాయింపు కూడా ఇచ్చింది. అలాగే, ప్రభుత్వ పథకాల ఖాతాలకు కూడా ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం వచ్చేనెల 1వ తేదీ నుంచే అమలులోకి వస్తుందని తెలిపింది.