biometrics: ఐడీ కార్డులు ఇక మర్చిపోండి.. బయోమెట్రిక్‌తోనే విమానంలోకి ఎంట్రీ!

  • విమానాశ్రయాల్లో పేపర్ రహిత విధానం
  • ఇక కార్డులకు చెక్ పడినట్టే
  • వేలి ముద్రతోనే అన్నీ పూర్తి

విమానాశ్రయాల్లో పేపర్ రహిత విధానాన్ని ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వం అందుకు తగ్గ కార్యాచరణ రూపొందిస్తోంది. ఎయిర్‌పోర్టులోని డేటాబేస్‌తో ప్రయాణికుల ఆధార్, ఐడీ, పాస్‌పోర్టు నంబర్లను అనుసంధానం చేయాలని విమానయాన శాఖ యోచిస్తోంది. ఒకసారి ఇది పూర్తయితే ప్రయాణికులు ఇక తమ వెంట ఎటువంటి ఆధారాలు తీసుకెళ్లాల్సిన పని ఉండదు. ఒక్క బొటనవేలితో అన్ని పనులు పూర్తవుతాయి. ఇందుకోసం అన్ని విమానాశ్రయాల్లో బయోమెట్రిక్ మిషన్లను ఏర్పాటు చేస్తారు.

విమాన టికెట్ కానీ, ఈ-టికెట్ కానీ ఇక చూపించాల్సిన పని ఉండదని ఏవియేషన్ సెక్రటరీ ఆర్ఎన్ చౌబే తెలిపారు. బయోమెట్రిక్‌లో ప్రయాణికుడు తన వేలిని పెట్టగానే అతడు టికెట్ తీసుకున్నదీ, లేనిదీ వంటి అన్ని వివరాలు కనిపిస్తాయి. అంతేకాదు, అతడు సెక్యూరిటీ చెక్ పూర్తి చేసుకున్నాడా? లేదా? అన్న విషయం కూడా తెలిసిపోతుంది. ఈ ‘డిజియాత్ర’ విధానానికి ఏవియేషన్ అథారిటీ తుది రూపు ఇచ్చే పనిలో పడింది.

  • Loading...

More Telugu News