america: ఉత్తర కొరియాపై యుద్ధంపై అమెరికా తాజా స్పందన
* ఉత్తర కొరియాపై యుధ్ధం ప్రకటించలేదన్న అమెరికా
* ఆర్థిక, దౌత్యపరమైన చర్యల ద్వారానే ముందుకెళతాం
* తమపై అమెరికా యుద్ధం ప్రకటించిందన్న ఉత్తర కొరియా
ఉత్తర కొరియా, అమెరికాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న సంగతి తెలిసిందే. ఏ క్షణంలోనైనా యుద్ధం ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయంటూ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో, కొరియాపై యుద్ధం ప్రకటించామనే వార్తల్లో నిజం లేదంటూ అమెరికా తెలిపింది. ఈ ప్రచారం అసంబద్ధమని వైట్ హౌస్ ప్రెస్ కార్యదర్శి శారా శాండర్స్ చెప్పారు. కొరియా అణు కార్యక్రమాలను నిలువరించడంపైనే అమెరికా దృష్టిని సారించిందని తెలిపారు. ఆర్థిక, దౌత్యపరమైన చర్యల ద్వారానే తాము ముందుకు వెళుతుతున్నామని చెప్పారు.
మరోవైపు ఉత్తర కొరియా విదేశాంగ మంత్రి రి యాంగ్ హొ మాట్లాడుతూ, తమపై అమెరికా యుద్ధం ప్రకటించిన విషయం ప్రపంచానికంతా తెలుసని అన్నారు. అమెరికాకు ఉత్తర కొరియా దీటుగా సమాధానమిస్తుందని చెప్పారు.