electricity theft: విద్యుత్ చోరీని పసిగట్టే రోబో... అభివృద్ధి చేసిన లండన్ శాస్త్రవేత్తలు
- మీటర్ రీడింగులను తారుమారు చేసే అవకాశం లేదు
- మొదటి ప్రయోగం విజయవంతం
- పూర్తిస్థాయిలో అభివృద్ధికి ప్రయత్నాలు
అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రధాన సమస్యలుగా మారుతున్న విద్యుత్ చోరీ, మీటర్ రీడింగుల తారుమారును కట్టడి చేయడానికి లండన్ శాస్త్రవేత్తలు ఓ రోబోను తయారు చేశారు. భారత్ వంటి దేశాల్లో 40 శాతానికి పైగా ఉత్పత్తి చేసిన విద్యుత్ చోరీకి గురవుతోందని వారు పేర్కొన్నారు. పెద్ద మొత్తంలో విద్యుత్ అవసరాలను తీర్చుకుని మీటర్ రీడింగుల్లో మాత్రం తక్కువ వాడుకున్నట్లు చూపిస్తున్నారని, ఇలాంటి వారిని గుర్తించడం వల్ల విద్యుత్ చోరీని అరికట్టవచ్చని లక్సెంబర్గ్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తల బృందం వెల్లడించింది.
ఇందుకోసం వారు బ్రెజిల్‌లోని 3.6 మిలియన్ల కుటుంబాల విద్యుత్ వినియోగాన్ని ఐదేళ్ల పాటు అధ్యయనం చేశారు. ప్రొఫెషనల్ మీటర్ల ద్వారా నెలవారీ మీటర్ రీడింగులను సేకరించారు. వాటి ఆధారంగా ఓ ఆల్గారిథమ్ రూపొందించారు. ఈ ఆల్గారిథమ్ సాయంతో ఓ రోబోను రూపొందించారు. అనుమానాస్పద విద్యుత్ వినియోగాన్ని ఈ రోబో సులభంగా కనిపెడుతుంది. ఈ రోబోను ఉపయోగించి మళ్లీ బ్రెజిల్‌లోని కుటుంబాల మీద ప్రయోగించారు. వారిలో విద్యుత్ చోరీకి పాల్పడిన వారి వివరాలను రోబో విజయవంతంగా కనిపెట్టగలిగింది. కాకపోతే రోబో కనిపెట్టిన విషయాల్లో కొంత కచ్చితత్వ లోపం కనిపించడంతో, ఆ లోపాన్ని సరి చేయడానికి వారు ప్రయత్నిస్తున్నారు.