online sales: ఇక నుంచి ఆన్‌లైన్‌లో పెట్రోల్, డీజిల్ అమ్మ‌కాలు... యోచిస్తున్న కేంద్రం

  • ఇంటికే ఇంధ‌నం సరఫరా 
  • వెల్ల‌డించిన‌ ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్
  • బంకుల వ‌ద్ద ర‌ద్దీ త‌గ్గించే ప్ర‌య‌త్నం

ఇక గంట‌ల త‌ర‌బ‌డి పెట్రోల్ బంకుల్లో ఎదురుచూడాల్సిన ప‌నిలేదు. త్వ‌ర‌లోనే పెట్రోల్‌, డీజిల్ విక్రయాల‌ను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకువ‌చ్చేందుకు ప్ర‌భుత్వం యోచిస్తున్న‌ట్లు తెలుస్తోంది. న్యూఢిల్లీలో జ‌రిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో కేంద్ర చ‌మురు శాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ మాట్లాడుతూ ఈ విష‌యాల‌ను వెల్ల‌డించారు. ఆన్‌లైన్‌లో పెట్రోల్‌, డీజిల్ అమ్మ‌కాల‌ను చేప‌ట్ట‌డం వ‌ల్ల ఇంటికే ఇంధనాన్ని పంపిణీ చేయ‌డంతో పాటు పెట్రోల్ బంకుల వ‌ద్ద ర‌ద్దీ త‌గ్గించే అవ‌కాశం కూడా క‌లుగుతుంద‌ని ఆయన పేర్కొన్నారు. ఈ విష‌యానికి సంబంధించి ఇప్ప‌టికే ఆన్‌లైన్ విక్ర‌య సంస్థ‌ల‌ను సంప్ర‌దించిన‌ట్లు ఆయ‌న తెలియ‌జేశారు. దేశంలో ఉన్న నాలుగు కోట్ల మంది వినియోగ‌దారులకు కేవ‌లం ల‌క్ష రిటైల్ ఔట్‌లెట్లే ఉన్నాయ‌ని ప్ర‌ధాన్ గుర్తు చేశారు.

  • Loading...

More Telugu News