YSRCP: జగన్ పాదయాత్ర షెడ్యూల్, రూట్ మ్యాప్ రెడీ.. శ్రీవారి దర్శనంతో యాత్ర మొదలు!

  • ఇడుపులపాయలో మొదలై ఇచ్చాపురంలో ముగింపు
  • నవంబరు 2న మొదలు
  • స్పష్టత ఇచ్చిన వైసీపీ శ్రేణులు

వాయిదా పడిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర షెడ్యూల్, రూట్ మ్యాప్ సిద్ధమైనట్టు తెలుస్తోంది. నిజానికి అక్టోబరులోనే ఆయన పాదయాత్ర ప్రారంభం కావాల్సి ఉండగా వివిధ కారణాలతో వాయిదా వేశారు. నవంబరు 2న జగన్ పాదయాత్ర ఇడుపులపాయ నుంచి ప్రారంభం కానుంది.

పాదయాత్రకు ముందు జగన్ తిరుమల శ్రీవారిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకుంటారు. అనంతరం ఇడుపులపాయ చేరుకుని పాదయాత్రకు శ్రీకారం చుడతారు. తొలుత కడప, అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో పాదయాత్ర చేస్తారు. అనంతరం ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి, విశాఖపట్టణం, విజయనగరం, శ్రీకాకుళం మీదుగా సాగి ఇచ్చాపురంలో ముగుస్తుందని వైసీపీ శ్రేణులు తెలిపాయి.
 
 

  • Loading...

More Telugu News