drugs: 13 టన్నుల డ్రగ్స్‌కు మంటపెట్టిన ఆఫ్ఘన్ అధికారులు.. ఆకాశంలో దట్టంగా అలముకున్న పొగలు!

  • దేశవ్యాప్తంగా దాడులు.. 300 మంది అరెస్ట్
  • షిప్పింగ్ కంటెయినర్ లోని మాదక ద్రవ్యాలకు మంట  

మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతున్న ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వం 13 టన్నుల డ్రగ్స్‌ను బూడిద చేసింది. దేశంలో విచ్చలవిడిగా సాగుతున్న డ్రగ్స్ అక్రమ వ్యాపారాన్ని కూకటివేళ్లతో పెకిలించేందుకు కంకణం కట్టుకున్న ప్రభుత్వం 300 మందిని అరెస్ట్ చేసింది. ఓ షిప్పింగ్ కంటెయినర్‌లో పెద్ద మొత్తంలో దాచి ఉంచిన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం వాటిపై కిరోసిన్ పోసి మంటపెట్టింది. ప్రభుత్వం బూడిద చేసిన మాదకద్రవ్యాల్లో హెరాయిన్, మార్ఫిన్, హాషిస్, నల్లమందు, రసాయనాలు, ఆల్కహాల్, కెఫిన్ తదితరాలు ఉన్నట్టు నాంగర్‌హార్ పోలీసు చీఫ్ అబ్దుల్ రహమాన్ రహిమీ తెలిపారు.

  • Loading...

More Telugu News