resume: రెజ్యూమె ఇలా కూడా తయారుచేయొచ్చా?.... వినూత్నంగా రెజ్యూమె తయారు చేసిన యువకుడు!
- రెజ్యూమెను ర్యాప్ చేసిన ఉద్యోగార్థి
- ఇష్టమైన సంస్థలో ఉద్యోగం కోసం వినూత్న ప్రయత్నం
- వైరల్ అవుతున్న వీడియో
ఆకట్టుకునే రెజ్యూమె తయారు చేయగలిగితే ఉద్యోగం దానంతట అదే వస్తుందని కార్పోరేట్ వర్గాలు చెబుతుంటాయి. ఆ పద్ధతినే ఫాలో అయ్యాడీ న్యూయార్క్ యువకుడు. గ్రాఫిక్ డిజైనర్‌గా కొన్ని ఇంటర్న్‌షిప్‌లు పూర్తి చేసిన డ్వేన్ కిర్క్లాండ్, తనకు ఎంతో ఇష్టమైన వేనార్ మీడియా సంస్థలో ఉద్యోగం కోసం రెజ్యూమెను ర్యాప్ సాంగ్ మాదిరిగా పాడి, వీడియో రూపంలో వాళ్లకి మెయిల్ చేశాడు. అదే వీడియోను డ్వేన్ తన యూట్యూబ్ అకౌంట్లో షేర్ చేశాడు.
అయితే, అతనికి ఉద్యోగం వచ్చిందో రాలేదో తెలియదు గానీ, ఆ వీడియో మాత్రం ఇప్పుడు యూట్యూబ్‌లో వైరల్‌గా మారింది. ఇప్పటికే ఆ వీడియోను దాదాపు 12 లక్షల మంది వీక్షించారు. ప్రముఖ ర్యాపర్ కెండ్రిక్ లామార్ పాడిన `డీఎన్ఏ` అనే పాట ఆదర్శంగా తన రెజ్యూమెను కెండ్రిక్ ర్యాప్ చేశాడు. అందులో తన ఇంటర్న్‌షిప్‌ల గురించి, విద్య వివరాలు, తన ప్రవర్తన వివరాలతో పాటు ఒకవేళ ఉద్యోగం ఇస్తే వేరే ప్రాంతానికి మారడానికి కూడా సిద్ధంగా ఉన్న సంగతిని ర్యాప్ చేస్తూ తెలియజేశాడు.