vijayawada kanakadurga: కనకదుర్గమ్మ ఆలయంలో ముగిసిన దసరా ఉత్సవాలు
- పూర్ణాహుతితో ఉత్సవాలకు ముగింపు
- భారీగా తరలి వచ్చిన భక్తులు
- రెండు కిలోమీటర్ల మేర క్యూ లైన్లు
బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో దసరా ఉత్సవాలు ముగిశాయి. అమ్మవారికి పూర్ణాహుతితో ఆలయ అర్చకులు శరన్నవరాత్రి ఉత్సవాలకు ముగింపు పలికారు. మరోవైపు అమ్మవారు రాజరాజేశ్వరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈ సాయంత్రం కృష్ణానదిలో దుర్గామల్లేశ్వర స్వామి తెప్పోత్సవం జరగనుంది. దసరా పర్వదినం సందర్భంగా ఈ రోజు ఆలయానికి భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు. దర్శనం కోసం రెండు కిలోమీటర్ల మేర భక్తులు క్యూ కట్టారు. చివరి రోజు కావడంతో వీఐపీలు, భవానీ భక్తులు భారీ సంఖ్యలో అమ్మవారి దర్శనం కోసం వచ్చారు.