mudragada padmanabham: నాడు నెంబర్ ప్లేట్ లేని వాహనంలో వైయస్ ఇంటికి వెళ్లి.. చంద్రబాబు సాయం తీసుకున్నారు: ముద్రగడ సంచలన వ్యాఖ్యలు
- నేనెవరి సాయాన్ని తీసుకోలేదు
- వైయస్ సాయాన్ని చంద్రబాబు తీసుకున్నారు
- ఎవరి రిమోట్ ద్వారానో కాపు ఉద్యమం కొనసాగడం లేదు
- డిసెంబర్ 6 తర్వాత భవిష్యత్ కార్యాచరణ
ముఖ్యమంత్రి చంద్రబాబుపై కాపు రిజర్వేషన్ ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరిగినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ఇంటికి చంద్రబాబు వెళ్లారని ముద్రగడ అన్నారు. నెంబర్ ప్లేట్ లేని కారులో వైయస్ ఇంటికి వెళ్లారని... ఆయన సాయం తీసుకున్నారని అన్నారు.
తాను ఏనాడూ ఎవరి సహాయం తీసుకోలేదని... వైయస్ బతికున్నప్పుడు ఆయన సాయం కూడా తీసుకోలేదని ముద్రగడ చెప్పారు. తాను వైసీపీ అధినేత జగన్ సాయాన్ని కూడా కోరలేదని... కాపు ఉద్యమం వెనుక జగన్ ఉన్నాడనే తప్పుడు ప్రచారం జరుగుతోందని మండిపడ్డారు. కాపు ఉద్యమం ఎవరి రిమోట్ సాయంతో నడవడం లేదని స్పష్టం చేశారు. కాపు ఉద్యమం గురించి చంద్రబాబు తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలని సూచించారు. డిసెంబర్ 6వ తేదీ తర్వాత తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని చెప్పారు.