Ben Stokes: ఇంగ్లండ్ క్రికెటర్ కొట్టింది మాజీ ఆర్మీ అధికారినట.. విచారణలో తేలింది ఇదే

  • బాధితుడిని బ్రిటిష్ ఆర్మీ మాజీ అధికారిగా గుర్తింపు
  • దాడి చేసినట్టు వీడియో ఫుటేజ్ లభ్యం 
  • క్రికెటర్ హేల్స్‌ను కూడా విచారణకు పిలిచిన పోలీసులు

ఇటీవల బ్రిస్టల్‌లోని ఓ నైట్ క్లబ్ బయట ఇంగ్లండ్ క్రికెటర్ బెన్‌స్టోక్స్ ఓ వ్యక్తిపై దాడిచేశాడు. దీంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేసి ఆ తర్వాత వదిలిపెట్టారు. ఈ గొడవ కారణంగా విండీస్‌తో జరిగిన వన్డేకు అతడు దూరమయ్యాడు. కాగా, స్టోక్స్ దాడిచేసి గాయపరిచిన వ్యక్తిని పోలీసులు బ్రిటిష్ ఆర్మీ మాజీ అధికారి ర్యాన్ హేల్‌ (26)గా గుర్తించారు. ఆఫ్ఘనిస్థాన్‌లో ఆయన పనిచేశారని పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది.

గొడవ జరుగుతున్న సమయంలో స్టోక్స్‌తోపాటు సహచర ఆటగాడు అలెక్స్ హేల్స్ కూడా ఉన్నాడు. హేల్స్ నిలువరించే ప్రయత్నం చేసినా స్టోక్స్ వినిపించుకోకుండా ఆర్మీ మాజీ అధికారిపై పిడిగుద్దులు కురిపించడం వీడియో ఫుటేజీలో స్పష్టంగా కనిపించింది. ఈ ఘటనలో ఇద్దరిని ప్రత్యక్ష సాక్షులుగా గుర్తించిన పోలీసులు హేల్స్‌ను తమ ముందు హాజరుకావాల్సిందిగా ఆదేశించారు. వచ్చేవారం ఆయన పోలీసుల ఎదుట హాజరయ్యే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News