facebook: ప్రజల్లో విభజనలు సృష్టించినందుకు క్షమాపణలు కోరిన ఫేస్బుక్ సీఈఓ
- మంచిగా ఉండటానికి ప్రయత్నిస్తానని వ్యాఖ్య
- సరైన కారణాలు వెల్లడించని మార్క్
- అమెరికా ఎన్నికల్లో ఫేస్బుక్ పాత్ర గురించి వస్తున్న ఆరోపణలే కారణం?
తన వృత్తి ద్వారా ప్రజల్లో విభజనలు సృష్టించినందుకు సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్ క్షమాపణలు కోరారు. యూదులకు పవిత్ర దినాలైన యోమ్ కిప్పోర్ ముగుస్తున్న సందర్భంగా ఆయన ఫేస్బుక్లో ఓ పోస్ట్ పెట్టారు. `ప్రజల్ని ఏకం చేయడానికి ఉపయోగపడాల్సిన తన వృత్తి వారిని విభజించేందుకు ఉపయోగపడింది. అందుకే నేను క్షమాపణలు కోరుతున్నా. ఇక నుంచి మంచిగా ఉండటానికి ప్రయత్నిస్తాను` అని పేర్కొన్నారు.
అయితే ఆయన ఏ విషయం గురించి క్షమాపణలు అడుగుతున్నారో స్పష్టంగా వివరించలేదు. అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా ప్రభావానికి సోషల్మీడియా సైట్లు బాగా ఉపయోగపడ్డాయనే ఆరోపణల నేపథ్యంలోనే ఆయన ఇలాంటి పోస్ట్ పెట్టి ఉంటారని విశ్లేషకులు చెబుతున్నారు. అలాగే తన కారణంగా ఎవరైనా బాధపడి ఉంటే, క్షమించాలని ఆయన కోరారు.